గర్వము

గర్వము

సామెతలు 16:18

నేను (I) అనే భావనే గర్వం. ఇంగ్లిష్ A,B,C.. లలో అన్ని అక్షరాలు ఏదో ఒక చోట వంగుతాయి. కాని I మాత్రం నిలబడి ఉంటాది. అదే గర్వం. నాశనమునకు ముందు గర్వము నడుచును (సామెతలు 16:18).  గర్వము వల్ల నాశనం అయిన ఒక వ్యక్తి గురించి చెప్తాను. అంతకంటే ముందు నాశనము లేదా పాపము ఏదోను తోటలో అవ్వ వలన రాలేదు. నాశనము / పాపము ముందు పైనే జరిరిగింది. లూసిఫర్ గురించి బైబిల్ లో అతని గురించి మనకు తెలుసు. యెషయా 14:12 లో చెప్పబడిన  తేజోనక్షత్రం, వేకువ చుక్క ఈ లూసిఫర్. దేవుని కంటే కొంచెం తక్కువగా, దేవధూతలకి అధికారిగా ఉన్నటువంటి ఈ లూసిఫర్ నేనె దేవుడుని ఎందుకు కాలేను అని గర్వపడ్డాడు. ఆ గర్వ ఫలితమే ఈ లోకానికి సాతానుగా క్రిందికి తోసివేయబడ్డాడు.

ప్రియ సోదరుడా/ సోదరి… నువ్వు కూడా లూసిఫర్ లా నెనే గొప్పవాడిని, నేనె జ్ఞానవంతుడుని, నేనె గొప్ప అధికారిని అని గర్వపడుచున్నవా? జాగ్రత్తా… నాశనానికి చాల దగ్గరగా ఉన్నావ్. అందం, ఆస్థి, అంగ బలంతో విర్రవీగుచున్నవా?? జాగ్రత్త నాశనానికి అతి దగ్గరగా ఉన్నావ్. నీలా గర్వంతో విర్రవీగిన అష్షురు రాజును, ఐగుప్తీయులనూ, యుదావారు, ఎరుషలేము ప్రజలు, మోయాబీయులు, యాకోబు సంతతివారి గర్వము అణిచిన దేవుడు నీ గర్వాన్ని కూడా అణిచివేస్తాడు అని మరచిపోకు.

(ఎహెజ్కేలు 30:18, ఆమోసు 6:7, యెషయా 10:12, యెషయా 48:29, యిర్మియా 13:9)

గర్వము ఎలా వచ్చును?
1. మాటలు బట్టి
2. నోటి పాపము బట్టి
3. అబద్ధము బట్టి (కీర్తన 59:12)
4. ధనము బట్టి (కీర్తన 62:10)

గర్వముతో ఎటువంటివి చేయకూడదు?
1. గర్వముతో మాట్లాడకుడి (1సమూయేలు 2:3)
2. ఇశ్రాయేలు ప్రజలవలే గర్వముతో విగ్రహారాధన చేయకూడదు (లేవి 26:19)

గర్వముతో ఏమి చేస్తారు?
1. గర్వముతో నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదువు (కీర్తన 31:18)
గర్వము వలన ఏమి జరుగును?
1. గర్వము వలన జగడము పుట్టను (సామెతలు 13:10)
2. గర్వ హృదయము పాప యుక్తము (సామెతలు 21:4)
3. ఎవని గర్వము వానిని తగ్గించును (సామెతలు 29:23)
4. గర్వము మాటలాడించును (కీర్తన 17:10)
5. గర్వముతో యెహోవా కార్యము తెలుసుకోలేక పోవుదురు (ద్వితీ 32:27)
6. గర్వముతో మొఱ్ఱపెట్టుదురు. కానీ దేవుడు వారి మొర వినడు (యెబు 35:12)

దావీదు వాలే, సంసోను వాలే దేవుని పని మంచిపనికోసం గర్వ పడాలి కాని నాశనము కోసం పాపము కోసం కాదు. (న్యాయాది16:5, 1సమూయేలు 17:28)

గర్వపు జీవితము క్రైస్తవ జీవితం కాదు సహోదారుడా. క్రైస్తవులు అన్ని విషయాలలో మాదిరిగా ఉండాలి. దేవుడే స్వయంగా యిర్మియా 13: 15 లో చెప్తున్నాడు ‘గర్వపడుకుడి’ అని.  ఎందుకంటే గర్వము దేవునికి అసహ్యము (సామెతలు 8:13). దేవుడే చెప్తున్నాడు కదా స్నేహితుడా, మనకు తెలియకుండా ఇన్నేళ్ళ గర్వముతో బ్రతుకుతున్నామేమో ఒకసారి పరీక్షించుకొని, దేవునికి ఆసహ్యామైన గర్వము విడిచిపెడదాము.
అష్షురురాజు గర్వించేను, అతని గర్వము బట్టి శిక్షించెను. కాని హిజ్కియా గర్వము విడిచి, తగ్గించుకొనేను కాబట్టి యెహోవా కోపం వారి ప్రజలమీద రాలేదు (2దిన 32:26)

స్నేహితులారా… మీరే ఆలోచించుకోండి. గర్వము విడిచి రక్షింపబడతారో?
గర్వముతో నాశనము పొందుతారో?

Leave your vote

0 points
Upvote Downvote

Total votes: 2

Upvotes: 1

Upvotes percentage: 50.000000%

Downvotes: 1

Downvotes percentage: 50.000000%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *