దేవుడు ఆలకింపని ప్రార్ధన

దేవుడు ఆలకింపని ప్రార్ధన

(*అపహాస్యకుల ప్రార్ధన దేవుడు ఆలకింపడు*)

నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడ కుందును.    సామెతలు 1:28

ప్రార్థనకు ప్రతిఫలం రాకపోవడానికి గల కారణాలు:

  • నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి

ఆయన పిలిచినప్పుడు మనము వినలేదేమో? ఆయన చేయి చాచినప్పుడు ఆయన దరికి చేరలేదేమో? నాకు బలముంది. నాకు ధనముంది. నాకెవ్వరితోనూ పనిలేదంటూ ఆయనను పట్టించుకొనే ప్రయత్నం చెయ్యలేదేమో?

  • నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసి వేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి.

ఆయన భోధించినప్పుడు, ఆయన సేవకుల ద్వారా వాక్యము ప్రకటించ బడుతున్నప్పుడు వినలేదు సరికదా, వారిని అపహాస్యం చేసామేమో? ప్రభువు తన వాక్యం ద్వారా గద్ధింపగా లోబడలేదు సరికదా, ఆయనకు ఎదురు తిరిగామేమో?

ఫలితంగా ఆయన తీర్పును ప్రకటిస్తున్నాడు:

  • కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను

ధనము, బలమూ ఎప్పుడూ మనతో నుండదు కదా? మనకు అపాయము వచ్చినప్పుడు ఆయన నవ్వుతాడట. మనము భయపడుతుంటే ఆయన అపహాస్యం చేస్తాడట. కారణం? ఆయన మాటలను లెక్క చెయ్యకుండా అపహాస్యం చేసాము కదా!

  • భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగు నప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను.

భయము తుఫానువలే ప్రచండముగా మన మీదికి వచ్చినప్పుడు, సుడిగాలి వలే అపాయము మనమీదికి వచ్చినప్పుడు, కష్టము, దుఃఖము కలిగినప్పుడు ఆయన మనలను అపహాస్యం చేస్తాడట.

అంతే కాదు, మనము ఎంత రోధించినా, ఆయన మన ప్రార్ధన  వినడట. ఎంత వెదకినా కనబడడట.

వద్దు! ఆయన పిలిచినప్పుడు ఆలకిద్దాం! ఆయన దినమెల్లా మనకోసం చేతులు చాచుతున్నాడు ఆయన దరికి చేరి, ప్రార్దిద్దాం! పొందుకుందాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!

ఆమెన్!    ఆమెన్!    ఆమెన్!

Leave your vote

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *